అవకాశాలు రాకపోయినా డోంట్ కేర్

    disha

    లోఫర్ తో టాలీవుడ్ కు పరిచయమైన దిశాపటానికి.. తర్వాత ఇక్కడ అంతగా అవకాశాలు రాలేదు. దీంతో అమ్మడు బాలీవుడ్ బాట పట్టింది. ధోనీలో దిశా పటాని రోల్ కు మంచి మార్కులు పడ్డాయి. సుశాంత్ సింగ్ రాజ్ పుత్ తో అమ్మడు పండించిన కెమిస్ట్రీ అక్కడ ఫుల్ ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించిపెట్టింది.

    ధోనీ మూవీ ఆస్కార్ ఎంట్రీగా సెలక్టవడంతో.. ఆ మూవీలో నటించిన దిశా పటానీకి హాలీవుడ్ ఛాన్స్ వచ్చింది. దీపికా, ప్రియాంకా లాంటి సూపర్ స్టార్స్ కు హాలీవుడ్ వెళ్లడానికి దశాబ్ద కాలం పడితే.. దిశాకు మాత్రం చాలా త్వరగా అవకాశం రావడంపై బాలీవుడ్ లో హాట్ చర్చ నడుస్తోంది.

    హీరోయిన్ అయినా, ఎక్స్ పోజింగ్ చేసినా.. తనకు సిగ్గు ఎక్కువేనంటోంది దిశా పటానీ. అక్క తప్ప ఎవరూ స్నేహితుల్లేరట. చిన్నప్పుడు ఇలా ఉండే దిశా.. పెద్దయ్యాక మాత్రం భయపడకుండా ఎక్కడికైనా వెళ్లి ఏదైనా చేసే విధంగా తయారైంది. చివరకు హీరోల మీద కూడా సెటైర్లు పేలుస్తోంది.

    హీరోలెప్పుడు హీరోయిన్ గురించి, ఆమె క్యారెక్టర్ గురించి పట్టించుకోరని, అలాంటి హీరోల గురించి తాను మాత్రం ఎందుకు పట్టించుకోవాలని అడుగుతోంది దిశా. మిగతా హీరోయిన్ల మాదిరిగా షూటింగ్ గ్యాప్ లో హీరోతో కబుర్లు చెప్పదట అమ్మడు. అవకాశాలు రాకపోయినా డోంట్ కేర్ అంటోంది దిశా.